fghanistan Cricketer Najeeb Tarakai is no more
#Afghanistan
#NajeebTarakai
#RashidKhan
రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిన అఫ్గానిస్థాన్ క్రికెటర్ నజీమ్ తరకై(29) ప్రాణాలు కోల్పోయాడు. గత శుక్రవారం నజీబ్ మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా రోడ్డు దాటుతున్న క్రమంలో ఓ ప్యాసింజర్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్రికెటర్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో నజీమ్ కోమాలోకి వెళ్లాడు. ఇక నజీమ్ మరణవార్తను అఫ్గాన్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది.